మహబూబ్ నగర్: తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టాలని వైద్యారోగ్య, కుటుంబ-సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటింటికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తుంటే... వాటిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ మనకు అవసరమా? అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతి ఘనపూర్ గ్రామ పరిధిలోని మేడిగడ్డతండాలో రూ.1.3 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులను మంత్రి నేడు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. రూ. 45 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు అవుతున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. ప్రాజెక్టులు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నిరంతర నల్లా నీళ్ళు, మిషన్ కాకతీయ, ప్రాజెక్టులు ద్వారా చెరువులకు పూర్వ వైభవం, ఊరూరా బీటీ, సీసీ రోడ్లు ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి గతంలో ఎన్నడూ ఎక్కడా జరగలేదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa