ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియా ఆటగాళ్లకు వేతనాల పెంపు : బీసీసీఐ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 03:35 PM

శ్రీలంక టూర్ కు ముందే టీమిండియా ఆటగాళ్లకు వేతనాలు పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మార్చి 3నుంచి జరిగే త్రికోణ సిరీస్ కోసం టీం ఇండియా ఆటగాళ్లు శ్రీలంక వెళ్లనున్నారు. అయితే అంతకు ముందే ఆటగాళ్లకు జీతాలు పెంచుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే బీసీసీఐ ఆటగాళ్లను మూడు కేటగిరీలుగా విభజించి.. జీతాలు పెంచనున్నట్లు పేర్కొంది. ఇందులో టెస్ట్‌లు, వన్డేలు, టీ-20లు ఆడే వాళ్లు ఏ+గా.. ఇతరులను ఏ, బీ కేటగిరీలుగా విభజించినట్లు ఓ సమావేశంలో బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, హార్థిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ తదితర ఆటగాళ్లకు భారీగా వేతనాలు పెరుగనున్నాయి. అయితే ఇప్పటికే టెస్టుల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఏ+ కేటగిరీలో ఉంచడంపై పలు విమర్శలు వచ్చాయి. దీంతో ధోనీని ఈసారి ఆ కేటగిరీ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa