ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్తీ చిదంబరం జైలుకు వెళ్లడం ఖాయం : సుబ్రమణ్యస్వామి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 03:55 PM

న్యూఢిల్లీ: కార్తీ చిదంబరం జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో ఇవాళ సీబీఐ అధికారులు చెన్నై విమానాశ్రయంలో కార్తీని అరెస్టు చేశారు. మనీల్యాండరింగ్ కేసులో సీబీఐ ఆయనకు అనేక అవకాశాలు ఇచ్చిందని, అన్ని తప్పుడు ఆధారాలు చూపించాడని, అందుకు సీబీఐ కార్తీని అరెస్టు చేసినట్లు సుబ్రమణ్యస్వామి తెలిపారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో సీబీఐ కార్తీపై చార్జ్‌షీట్ దాఖలు చేస్తుందని అన్నారు. ఇదో గొప్ప అచీవ్‌మెంట్ అని తెలిపారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa