ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2019 వరకు ఆడాలనుకుంటున్నా.. యువీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 04:12 PM

మొనాకో:రిటైర్మెంట్ నిర్ణయం తీసుకునేలోగా 2019 వరకు క్రికెట్ ఆడతానని భారత ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ తెలిపాడు. గత కొద్దిరోజులుగా యువీ జాతీయ జట్టులో చోటుకోల్పోయిన విషయం తెలిసిందే. చివరిసారిగా యువీ 2017 జూన్‌లో భారత్ తరఫున వన్డే మ్యాచ్‌లో ప్రాతినిధ్యం వహించాడు. వచ్చే ఐపీఎల్ టోర్నీ తనకు అత్యంత ముఖ్యమైనదని.. ఇందులో అద్భుతంగా రాణించి 2019 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి ఉపయోగపడుతుందని యువీ అభిప్రాయపడ్డాడు. 


మొనాకోలో ప్రపంచ స్పోర్ట్స్ అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న యువరాజ్ మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో బాగా రాణించాలని చూస్తున్నా. 2019 వరకు క్రికెట్ ఆడేందుకు ఈ టోర్నమెంట్ నాకు చాలా ముఖ్యమైనది. ప్రపంచకప్ వరకు క్రికెట్ ఆడాలని భావిస్తున్నా. ఎలాంటి క్రికెట్ అయినా ఆడుతానని అనంతరం వీడ్కోలు పలుకుతానని యువీ చెప్పాడు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో మంచి ప్రదర్శన చేసిన స్పిన్నర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్ అసాధారణంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికా తీవ్రంగా ఇబ్బందిపెట్టారు. ఇదే వూపుతో టీ20 సిరీస్‌ను 2-1తో గెలిపించారు. విదేశాల్లో మూడు సిరీస్‌ల్లో రెండింట్లో సిరీస్‌లను సొంతం చేసుకోవడం భారత్ ఆధిపత్యాన్ని తెలియజేస్తోందని యువీ అన్నాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa