ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్యాన్సర్ నియంత్రణకు టాటా ట్రస్టుతో ఒప్పందం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 02:36 PM

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కాంప్రహెన్సివ్‌ కాన్సర్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద టాటా ట్రస్ట్‌తో ఒప్పందం చేసుకుంది. శంషాబాద్ నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటా సమక్షంలో..ఈ ఒప్పందంపై వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శాంతకుమారి, టాటా సంస్థ ప్రతినిధి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ..కేన్సర్‌ నివారణపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐకేర్‌ ప్రోగ్రాం కింద రాష్ట్రంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌తో పాటు పలు ఆస్పత్రుల్లో కేన్సర్‌కు చికిత్సను అందిస్తున్నామని.. కేన్సర్‌ స్క్రీనింగ్‌ ప్రోగ్రామ్‌ కింద 13 జిల్లాల్లో పరీక్షలు జరుపుతున్నామని వెల్లడించారు. కేన్సర్‌ నియంత్రణపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని టాటా ట్రస్ట్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. హెల్త్‌కేర్‌లో టాటా గ్రూప్‌ విశేష సేవలు అందిస్తున్నదన్నారు. కొత్త ఆవిష్కరణలపై టాటా ట్రస్ట్‌ దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa