బెర్లిన్:నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై నడిచిన దాదాపు 50ఏళ్ల పూర్తికావొస్తోంది. వచ్చే ఏడాది చంద్రునిపై 4జీ కవరేజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దిగ్గజ టెలికాం సంస్థ వొడాఫోన్ ప్రయత్నాలు ప్రారంభించింది. వొడాఫోన్ జర్మనీ ఈ బృహాత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెక్నాలజీ పార్ట్‌నర్‌గా నోకియాను నియమించుకొంది. ప్రైవేట్ రంగంలో బెర్లిన్‌కు చెందిన స్పేస్ కంపెనీ పీటీ సైంటిస్టుల కంపెనీ సహకారంతో వొడాఫోన్ జర్మనీ, నోకియా ప్రైవేట్ భాగస్వామ్యంతో తొలిసారి చందమామపై ఈ ఘనత సాధించాలని చూస్తున్నాయి. మిషన్ మూన్‌లో భాగంగా 2019లో కేప్ కెనవరాల్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగం చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం తొలిసారి లైవ్-స్ట్రీమింగ్ ద్వారా హెచ్‌డీ వీడియోను ప్రసారం చేసి ప్రత్యేక అనుభూతి కల్పించనుంది. కంప్యూటర్ యుగంలో టెక్నాలజీని ఎన్నో ప్రాంతాల్లో... ఎన్నో రకాలుగా వినియోగిస్తున్నాం. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థలో ప్రతిఏడాది కొత్త తరం టెక్నాలజీని అందిపుచ్చుకొని జెట్ వేగంతో దూసుకెళ్తున్నాం. ప్రతి దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు మారుమూల గ్రామాలకు టెలికాం సంస్థలు 4జీ సేవలు అందిస్తున్నాయి. ఐతే ఇప్పుడు శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు జాబిల్లిపై 4జీ నెట్‌వర్క్‌ను సిద్ధం చేయడానికి రెడీ అవుతున్నారు.
Nearly 50 years after man first went to the moon, we’re teaming up with @Nokia and @PTScientists to create the first 4G network on the moon. More details about the out of this world plan here: https://t.co/V85a2T83ra pic.twitter.com/IlKPQzBewL
— Vodafone Group (@VodafoneGroup) February 27, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa