తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రాద్రి జిల్లా చర్ల సమీపంలోని తొండపాల్ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందగా, ఓ జవానుకు గాయాలయ్యాయి. జవానును హెలికాప్టర్‌లో భద్రాచలం తరలించారు. ఎదురుకాల్పుల్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఇంకా ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa