జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కాల్పుల్లో ముగ్గురు గ్రేహాండ్స్ కానిస్టేబుళ్లు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండలం సరిహద్దులోని తడపలగుట్ట-పుజారికాంకేడు అటవీప్రాంతంలో పోలీసులకు-మావోయిస్టులకు మధ్య ఈ ఎదురుకాల్పులు జరిగినట్లుగా సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించనున్నారు. మృతుల్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ సెక్రటరీగా పనిచేస్తున్న హరిభూషణ్ ఉన్నట్లుగా సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa