ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 3న ప్రజల ముందుకు జేఎఫ్‌సీ నివేదిక: పవన్ కళ్యాణ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 10:24 AM

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చొరవతో ఏర్పాటైన జేఎఫ్‌సీ (జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ) హైదరాబాద్‌లో సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ నివేదిక రూపకల్పనపై చర్చించారు. మార్చి 3న ప్రజల ముందు నివేదిక ఉంచాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్‌తో పాటు.. కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్టారావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa