ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూతబడ్డ సినిమా థియేటర్లు...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 10:42 AM

తెలంగాణ, ఏపీలోగల సినిమా థియేటర్లు మూతబడ్డాయి. డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు... భారంగా మారిన వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు (వీపీఎఫ్‌) తగ్గించకపోవడాన్ని నిరసిస్తూ మార్చి 2 నుంచి థియేటర్లను మూసివేయాలని దక్షిణాది రాష్ర్టాల సినిమా నిర్మాతల మండలి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాల్లోగల సినిమా థియేటర్లను మూసివేశారు. ఒక్క నగరంలోనేగాక ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోగల 25 థియేటర్లు, నిజామాబాద్ జిల్లాలోగల 15 థియేటర్లు, ఓ మల్టీప్లెక్స్, కరీంనగర్ జిల్లా కేంద్రంలోగల 8 థియేటర్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోగల 36 థియేటర్లు కూడా మూతబడ్డాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సినిమా థియేటర్లన్నీ కూడా మూసివేశారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa