ఖమ్మం: వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నమని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లు, వరికొత యంత్రాలను మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పోచారం... భవిష్యత్తులో రైతు సమన్వయ సమితుల ద్వారానే కొనుగోళ్లు జరుపుతామన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్న పోచారం... సాగు కోసం రైతుకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 72 లక్షల మంది రైతులకు ఒకే రోజు పాస్ బుక్కుల పంపిణీ చేస్తామన్నారు. రైతులకు రెండు పంటలకు పెట్టుబడి అందజేస్తమన్నారు. ప్రభుత్వం చేయూతతో రైతు అప్పుల్లోంచి బయటపడతాడన్నారు. దేశంలోనే ఎక్కడా లేని ఆదర్శవంతమైన పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. ప్రభుత్వంలో వ్యవసాయశాఖ కీలకంగా మారిందన్న పోచారం.. వ్యవసాయ శాఖకు ఏమడిగానా సీఎం కేసీఆర్ ఇస్తున్నరన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa