వికారాబాద్ : పరిగిలోని ఖాన్ కాలనీ, బీసీ కాలనీ, మందుల కాలనీలో జిల్లా ఎస్పీ అన్నపూర్ణ ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పరిగి డీఎస్పీ, సీఐ, ఎనిమిది మంది ఎస్‌లై, 60 మంది పోలీసులు పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 52 బైక్‌లు, ఒక ఆటో, కారును పోలీసులు సీజ్ చేశారు. ప్రజల్లో భద్రతాభావం పెంచి.. వారికి భరోసా ఇచ్చేందుకు ఈ తనిఖీలు నిర్వహించామని ఎస్పీ అన్నపూర్ణ తెలిపారు. అన్ని కాలనీల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని స్థానికులకు ఎస్పీ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa