వనపర్తి : జిల్లాలోని పెబ్బేరు మండలం గుమ్మడం క్రాస్‌రోడ్డు వద్ద శనివారం మధ్యాహ్నం రోడ్డుప్రమాదం జరిగింది. రోడ్డు పక్కకు నిల్చున్న వ్యక్తులపై వేగంగా వచ్చిన లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రేషన్ డీలర్ ఆంజనేయులు మృతి చెందారు. సర్పంచ్ పద్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి విషయాన్ని గమనించి కారును ఆపారు. కలెక్టర్ తన వాహనంలోనే పద్మమ్మను చికిత్స నిమిత్తం వనపర్తి ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa