భువనేశ్వర్: ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ దివ్యాంగుల కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నది. దివ్యాంగులు ట్రెయిన్ ఎక్కడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారి కోసం మొబైల్ వీల్ చైర్ ఫోల్డబుల్ ర్యాంప్‌ను ప్రారంభించింది. ఈ ర్యాంప్‌ను కోచ్ మెట్ల వద్ద అన్‌ఫోల్డ్ చేసి వీల్ చైర్‌లో దివ్యాంగులను కూర్చోబెట్టి తీసుకెళ్లేలా తయారు చేశారు. ప్రస్తుతం భువనేశ్వర్, సంబల్‌పూర్, విశాఖపట్నం రైల్వే స్టేషన్లలో దీన్ని పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో దివ్యాంగులు వీల్ చైర్ సాయంతో ఈజీగా ట్రెయిన్ ఎక్కే వీలు ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa