2019 ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన నగరంలో మీడియాతో సమావేశమై మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకూల పవనాల వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. పీఎం మోదీని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ గురించి ఆయన ఏకవచనంతో మాట్లాడారన్నారు. ఎప్పటికైనా రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌కు కాంగ్రెస్సే ప్రధాన ప్రత్యర్థి అని, కేంద్రంలో కాంగ్రెస్ వచ్చిన కేసీఆర్ మద్దతు మాత్రం ఎన్నటికీ కోరబోమని స్పష్టం చేశారాయన.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa