హైదరాబాద్: ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్, లోక్ సభ, రాజ్య సభ సభ్యులు హాజరుకానున్నారు. ఈనెల 5 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ వ్యవహరించాల్సిన తీరు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే.. కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చ జరుగనుంది. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa