చేర్యాల, మేజర్‌న్యూస్: కోరుకున్న భక్తుల కొం గు బంగారంగా విరాజి ల్లుతున్న కొముర వెల్లి మల్లికార్జున స్వామి ఆలయం అశేష భక్తజనం తో పోటెత్తింది. బ్రహ్మోత్సవాలు (జాతర) ముగి ంపు దశకు వస్తుండగా స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. మొద టి వారాలను తలపిస్తూ ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడా యి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఈసారి కూడా హైదరాబాద్ జంట నగరాలతో పాటు కరీంనగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జనగామ, యాదాద్రి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హోలీ పండగ కారణంగా సోమవారం నాడు తక్కువగా ఉన్నప్పటికీ మధ్యా హ్నం నుంచి భక్తుల రాక ఎక్కువైంది. వచ్చీ రాగానే కోనేరు లో పవిత్ర స్నాన మాచరించిన భక్తులు స్వామివారికి బోనం వండి నైవేద్యం సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనానికి వెళ్లారు. భక్తుల రద్దీ పెరగ డంతో మధ్యా హ్నం నుంచీ ధర్మదర్శనం క్యూలైన మాత్రమే కాకుండా శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం క్యూలైన్లు కూడా రాజగోపురం బయట రోడ్డుపై బారులుదీరాయి. దీంతో మల్లన్న దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. స్వామిని దర్శించుకున్న భక్తులు పట్నాలు వేసి మొక్కులు తీర్చుకు న్నారు. రద్దీ పెరగడంతో ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణా రావు క్యూ లైన్ల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా సహాయ సహకారాలు అందిం చారు. ఈక్రమంలో ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, సిద్దిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేముల వెంకట్‌రెడ్డిలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.