హైదరాబాద్,మేజర్న్యూస్ః హైదరాబాద్ నగరం లోని కొండా పూర్లో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. సెల్లార్ కూలడంతో మట్టిలో మరో ఇద్దరు కూలీలు కూరుకుపో యినట్లు తెలుస్తోంది. కాగా ఘటనలో ఇద్దరు సజీవ సమాధి అయ్యారు. వీరిలో ఇద్దరు మహిళా కూలీలు ఉన్నారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. చనిపోయిన వారు భారతవ్వ (35), కిష్టవ్వ (25) అని తెలిసింది. రంగంలోకి దిగిన స్థాని కులు, సహాయక సిబ్బంది మిగతావారిని వెలికి తీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొండాపూర్లోని గూగుల్ ఆఫీస్ పక్కనే ఉన్న స్థలంలో సెల్లార్ తవ్వుతుండగా భారీ నిర్మాణం చేపడుతుండగా మట్టిపెల్లలు విరిగి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఇలాంటి భారీ తవ్వకాలు జరిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అయితే వాటన్నింటిని పట్టించుకోని యజమాని ఇష్టానుసారం నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ నిర్మాణం చేపడుతున్న యజమాని ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.