బోధన్,మేజర్‌న్యూస్: హోలీ పర్వదినం సందర్భ ంగా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో సోమవారం సాయంత్రం పిడిగుద్దులాట క్రీడను నిర్వహించారు. మంజీర నదిని ఆనుకుని మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న హున్సా గ్రామంలో ఏటా ఈ క్రీడను నిర్వహి స్తా రు. దశాబ్దాలుగా హోలీ పండుగ రోజు ఈ క్రీడ ను నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం. గ్రామ ంలోని ప్రధాన కూడలి వద్ద ప్రజలంతా గుంపుగా చేరి పిడిగుద్దులాటలో పాల్గొ ంటారు. గ్రామానికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ క్రీడను నిర్వహి స్తారు. అనంతరం ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ పిడిగుద్దు లాటలో గాయాలైన వారు కామదహనం చేసిన బూడిదను పూసుకుంటారు.