హైదరాబాద్,మేజర్‌న్యూస్: కానిస్టేబుల్ నియామ కాలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని షరతులను విధించింది. 188 హోమ్ గార్‌డ అభ్య ర్థుల నియామకం మినహాయించి మిగితావి నియామకం చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. నియ మకాలన్ని తుది తీర్పు లోబడి ఉండాలని ఆదేశిం చింది. 188 హోంగార్డు లు బి.సి.ఏ.స్సి. ఏ.స్టి రిజర్వేషన్ లో అర్హులుగా ఉంటే నియమించు కోవచ్చు. ఫలితాలను ప్రజలకు అనుమానాలు నివృతం చేసేలా వెబ్ సైట్‌లో పూర్తి ఫలితాలను ఉంచాలని తీర్పునిచ్చింది. 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణా ప్రభుత్వానికి ఆదేశించింది. కౌంటర్‌లో తప్పిదాలు ఉంటే కోర్‌టకు రావచ్చని పిటిషనర్లకు సూచించింది.పోలీస్ రిక్రూట్ మెంట్‌లో అవకతవకలు జరిగాయాంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం నాడు కోర్టు విచారణ జరిపింది. 63 మార్కలు వచ్చిన హోంగార్డు కి ఓపెన్ కేటగిరిలో ఉద్యొగం ఇవ్వటాన్ని హైకోర్టు తప్పుపట్టింది. దీనిపై అడ్వోకేట్ జనరల్ మాట్లాడుతూ 14ఎఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంమే అపాయింట్‌మెంట్ ఇచ్చామని హైకోర్టుకు చెప్పగా, పిటిషనర్ లేవనెత్తిన ప్రశ్నలకు క్లారీపై ఇవ్వాలని ఆదేశించింది.తెలంగాణ రాష్ట్రంలో 188 మంది హోంగార్‌డ్సఎంపిక అయ్యారు. కాబట్టి ఈ హోంగార్డు విషయం తేలేవరకు 188 మంది హోంగార్‌డ్స అపాయింట్‌మెంట్‌లను ఆపేయాలని, జిల్లాల వారిగా కేటగిరి ఎ,బి,సి,డి గా రిక్రూట్ మెంట్ సెలక్షన్ రూల్‌స ప్రకారం అన్నింటితో 2 వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలనని హైకోర్టు ఆదేశించింది. ఒకవేల రిక్రూట్‌మెంట్ సక్రమంగా జరగలేదని అనిపిస్తే నోటిఫికేషన్ రద్దు చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్‌డ ఛైర్మన్ పూర్ణ చందర్‌రావు హైకోర్టుకు హాజరయ్యారు.