-రాబోయే రోజుల్లో రైతులకు 24 గంటల కరెంటు
-ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువ పూర్తి చేసి 2 పంటలకు నీరందస్తాం
-మార్కెట్‌ను రాష్ర్టంలోనే ఉత్తమ మార్కెట్‌గా మారుస్తాం
-మార్కెట్‌లో రైతులకు రూ. 5కే భోజనం వసతి
సూర్యాపేటప్రతినిధి, మేజర్‌న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి, రైతులకొసమే నిరంతరం ఆలోచించి రైతే రాజు అని విధంగా తీర్చుదిద్దిందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడని రాష్ర్ట ఇందనం, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని వ్వవసాయ మార్కెట్ నూతన కమీటి ప్రమాణాస్వీకారోత్సవానికి ముఖ్యఅతిధిగా విచ్చేసి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో రైతులకు 9గంటలేకాక 24గం,, కరెంటును రైతులకు అందించానున్నట్లు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలను పూర్తి చేసి రెండు పంటలకు నీరందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. 3వ రైతు రుణాలు వడ్డీ మాఫీ చేసేందుకు నిధులు వెచ్చినట్లు ఎన్నో విత్తనాలు, ఎరువుల, యంత్రా పరికరాలు, సబ్సీడీపై అందిస్తున్న ఘనత ఒక్క ే సీఆర్‌కే దక్కిందన్నారు. దేశంలోనే నిజాంబాద్‌లోని అంకాపూర్ రైతులు ఎన్నో రకాల పంటలను ఆధునుక పద్దతుల ద్వారా పండిస్తు పంజాబ్, గుజరాజ్ రాష్ట్రాలకే కాక ఇతర దేశాల కూడ విత్తనాను సర ఫర చేస్తున్నారని, మన సూర్యాపేట జిల్లా రైతులు ఆధునిక పద్దతుల ద్వారా సేద్యం చేసేవిధంగా రైతులకు అవగాహన కల్పించి తగిన వనరులు కల్పింస్తామన్నారు. సూర్యాపేట వ్వవసాయ మార్కెట్ 21-03-1940 ఏర్పాటు చేయబడి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని, ఈనూతన మార్కెట్ యార్డు 2013లో 29 ఎకరాలల్లో విస్తీర్ణం కల్గి క్రమబద్దీకరించబడి, రైతులకు సాగునీటి, భోజనం వసతి కల్పించడం జరుగుతుందన్నారు. రూ. 5లకే భోజనం వసతి కల్పిస్తామని తెలిపారు. ప్రతి 5వేల జనాబాకు ఒక వ్వవసాయ అధికారిని నియమించమని వారి ద్వారా భూ పరీక్షచేయించి ఏరైతులు ఏభూమిలో ఏ పంట పండించాలో తెలిపేవిధంగా ప్రణాళికలు రూపొందించామని, రాబోయే రోజుల్లో దేశంలోనే తెలంగాణ రాషా్టన్న్రి నెం 1గా నిలుపుతామని తెలిపారు. అనంతరం మంత్రి నూతన కమీటిచే ప్రమాణాస్వీకారం చేయించారు. ఈకార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, తుంగతూర్తి శాసన సభ్యులు గాదరి కిషోర్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాశ్, యంపిపి జానయ్యయాదవ్, నూతన కమీటి చైర్మన్ యలగందుల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ కాకి కృపాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ నేరేళ్ల మధు, వ్వవసాయ మార్కెట్ కమీటి డైరెక్టర్లు సల్మామస్తాన్, బత్తుల రాజేంద్రప్రసాద్, దరావత్ లాల్, ముద్దిరెడ్డి లింగారెడ్డి, వెన్న సీతారామారెడ్డి, మురళీమోహన్, బోనాల రవీందర్, తూడి విద్యాసాగర్, కౌన్సిలర్లు బైరబోయిన శ్రీనువాస్, ఆకుల లవకుశ, జ్యోతికరుణాకర్, తండు శ్రీనువాస్, బాణాల విజయ్‌కుమార్, కుంభం రజిత, గండూరి పావనికృపాకర్, కోప్షన్ సభ్యులు ఉప్పల ఆనంద్, పెద్దపంగు స్వరూపారాణి, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాశ్, బడుగుల లింగయ్యయాదవ్, కోడి లింగయ్యయాదవ్, నాతి సవిందర్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, నూకల మధుసుధన్‌రెడ్డి, వెంపటి గురూజీ, మస్తాన్, కల్లెపెల్లి దశరధ, నేరే ళ్ళ మధుగౌడ్, నెమ్మాది బిక్షం, రౌతు నర్సింహ్మారావు, నెమ్మాది కృష్ణ, జెడ్‌పిటిసిలు, యంపిపిలు, వివిధ గ్రామాల ప్రజలు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
రాష్ట్రంలోని హోంగార్డులను పర్మినెంట్ చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై ఆలిండియా హోంగార్‌డ్స అసోసియేషన్ హర్షం వ్యక్త చేసింది. ఈ సందర్భంగా బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్‌క సమీపంలో కేసీఆర్ చిత్రపటానికి హోంగార్డులు పువ్వులు, పాలతో అభిషేకం చేశారు. హోంగార్డుల సమస్యలపై సీఎం కేసీఆర్, హోంమంత్రి, డీజీపీలు స్పందించడాన్ని అసోసి యేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల నారాయణ హర్షం వ్యక్తం చేశారు. తమను పర్మినెంట్ చేసే అంశంతో పాటు పలు సమస్యలపై ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించడం సంతోషకరమన్నారు. ఇదిలావుండగా వర్దన్నపేట మార్కెట్ చైర్మన్ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ వార్షిక బడ్జెట్‌లో గొల్లకురుమలకు నిధులు కేటా యించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ గొల్లకురుమలకు నిధులు కేటాయించడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ కు మేం రుణపడి ఉంటామని ఆయనన అన్నారు.