పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది.17 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ప్రారంభం కానున్న వృత్తివిద్యా కోర్సుల పరీక్షలకు పది సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 162 మంది విద్యార్థులు సంస్కృతం, అరబిక్, పర్షియన్ లాంగ్వేజ్ పరీక్షలకు హాజరుకానున్నారు.నగరంలోని ట్రాఫిక్‌రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. నిర్థేశిత సమయం 9.35కి నిమిషం ఆలస్యంగా వచ్చిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని హైదారాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ స్పష్టం చేశారు. స్కూల్ యూనిఫాంలో వచ్చే విద్యార్థులను కూడా లోపలికి అనుమతించబోమని తెలిపారు. పరీక్షహాల్‌లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్‌లు అనుమతించమని తెలిపారు. అత్యవసరమైతే డ్యూటీలో ఉన్న పోలీసుల వద్ద ఉన్న ఫోన్‌లను వాడుకోవచ్చని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, హాల్‌టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాలు, ఇతర సమస్యలపై 040-65537350 ఫోన్ నెంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa