నిజామాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టిన ప్రజా చైతన్య బస్సు యాత్ర బోధన్ చేరుకుంది. బోధన్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో పాల్గొనడానికి సిఎల్‌పి నేత జానారెడ్డి, మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ బోధన్ చేరుకున్నారు. ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా బోధన్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa