హైదరాబాద్: తెలంగాణకు చెందిన మూడు రాజ్యసభ స్థానాల కోసం జరగబోయే ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇవాళ ఎలక్షన్ కమిషన్ విడుదల చేయనుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 12 చివరి తేదీ కాగా.. ఈనెల 23న పోలింగ్ ఉంటుంది. మార్చి 13 నుంచి నామినేషన్ల పరిశీలన ఉండగా.. మార్చి 15 వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ వెసులుబాటు కల్పించింది. ఈ నెల 23న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గత సంవత్సరం జూన్ 9న అనారోగ్యం కారణంగా మరణించగా రాపోలు ఆనంద భాస్కర్, సీఎం రమేష్ టర్మ్ ఏప్రిల్ 2 తో ముగియనుంది. దీంతో తెలంగాణలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవనున్న సందర్భంగా వాటిని భర్తీ చేయడానికి ఎన్నికల కమిషన్ ఈ ప్రక్రియను ప్రారంభించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa