హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః తొలి కవయిత్రి మొల్ల జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లే అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం అధ్యక్షులు టంగటూరి నాగరాజు డిమాండ్ చేసారు. కుమ్మర్ల నైపుణ్యాన్ని గుర్తించి జాతీయ స్థాయిలో తగిన గుర్తింపునిచ్చి, పురస్కారాలు అందజేయాలని కోరారు. సోమవారం తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగిన జయంతి కార్యక్రమాల్లో నాగరాజు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా, భద్రాచలం జిల్లా, నల్గొండ జిల్లాల్లొ జరిగిన మొల్ల జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ మహిళలను విద్యకు ఆమడదూర లో ఉన్న రోజుల్లోనే కుమ్మరి కుటుంబలో జన్మించిన కవయిత్రి మొల్ల స్వయంగా విద్యనభ్యసించి రామాయణాన్ని తెలుగులో రచించి మహిళ లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. శూద్రకుల స్త్రీలపై విపరీతమైన ఆంక్షలు, అణిచివేతలు ఉండగా ఎంతో సాహసోపేతంగా 138 పద్యాలతో, సరళమైన వాడుక బాషలో రామాయణా న్ని రాయడం, ఒక మహిళ కవయిత్రిగా బ్రాహ్మణ ఆదిపత్యవ్యవస్థపై ఆమె చేసిన తిరుగుబాటని టంగుటూరి నాగరాజు అన్నారు. నాగరికత తొలినాళ్లనుంచే మట్టితో పాత్రలు చేయడం, ఆది మానవుని కాలంలోనే మట్టితో గుర్తులు, ఆనాటి పరిస్థితులు నాగరికతకు సంబంధించిన విషయాలు రేపటి సమజానికి అంధించడానికి కృషి చేసిన కుమ్మరి సమాజం యొక్క చైతన్యం కాలక్రమేనా అణిచివేతకు లోనయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతి సున్నితమైన కళ విస్మరించబడిందన్నారు. మన కళల్ని, సాంప్రధాయాల్ని కాపాడుకునే ప్రయత్నంలో కవయిత్రి మొల్ల వంటి వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలన్నారు. కవయిత్రి మొల్ల స్పూర్తితో ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమాములో ప్రెసిడెంట్ లీగల్ సెల్ తెలంగాణ తడూరి పరమేశ్ ,యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏళుకొంఢ రాంకోటి ,షెనిగారపు పాండు , యాదాద్రి జిల్ల ప్రెసిడెంట్ గంగాధర రాములు , తడూరి చంద్రం పాకాల రవి ,ఆశయ్య సిలివేరు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.