-ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తున్న అల్లోల, రామన్న
-మంు్తల్రిద్దరికీ సిఎం కెసిఆర్ అండదండలు
-నిత్యం సమీక్షలు, పర్యటనలతో అధికారుల గుండెల్లో రైళ్లు
-శాసనసభ్యులతో సత్సంబధాలను కొనసాగిస్తున్న అమాత్యులు
-ఏకఛత్రాధిపత్యంగా కొనసాగుతున్న టిఆర్‌ఎస్ పార్టీ
-వలసలను ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్న మంు్తల్రు
-మంు్తల్ర స్పీడ్‌ను తట్టుకోలేక పోతున్న ప్రతిపక్షాలు
ఠిమేజర్‌న్యూస్ తెలంగాణ ప్రతినిధిః తెలంగాణ కశ్మీర్‌గా పిలుచుకునే ఆదిలాబాద్ జిల్లా అభివృద్దిపై సిఎం కెసిఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓ వైపు అడువులు, మరోవైపు అడవి బిడ్డలతో ఉండే ఈ జిల్లాకు పూర్వ వైభవం తీసుకురావాలని సర్కార్ కంకణం కట్టుకుంది. సమైక్య రాష్ట్రంలో తీవ్ర అన్యాయానికి గురైనా ఆదిలాబాద్ జిల్లా అభివృద్దిపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో రాజకీయంగా, సామాజికంగా ఆదిలాబాద్ తీవ్ర వెనకబాటుకు గురైంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిస్థితికి స్వస్థి పలికిన సిఎం కెసిఆర్ ఈ జిల్లాకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో ఒక్క ముథోల్ మినహ అన్ని స్థానాలను గులాబీ దళం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సైతం కొద్ది రోజులకే గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తన మొట్టమొదటి క్యాబినెట్ విస్తరణలోనే జిల్లా నుండి జోగు రామన్న ను క్యాబినెట్‌లోకి తీసుకున్న కెసిఆర్ మలివిడత మంత్రి వర్గ విస్తరనలో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి మంత్రి పదవి అప్పగించారు. అప్పటి నుండి జిల్లా అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిఎం కెసిఆర్ మంత్రులిద్దరిని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిలు ఆదిలాబాద్‌ను అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జిల్లా అభివృద్ది కోసం సమన్వయంతో పనిచేస్తున్నారు. జిల్లాకు సంబందించిన ఎమ్మెల్యేలందరిని ఏకతాటిపైకి తీసుకువస్తున్నారు. వీరికి స్థానిక ఎంపిలు గోడెం నగేశ్, బాల్క సుమన్‌లు సహయ సహకారాలు అందిస్తున్నారు. ఆదిలాబాద్ తూర్పు జిల్లాలో పార్టీ పై పట్టు ఉన్న పురాణం సతీశ్ వంటి నేతలు రాజకీయంగా మంత్రులకు సూచనలు, సలహలు ఇస్తున్నారు. పార్టీ సీనియర్ నేతలు లోక భూమారెడ్డి, పురాణం సతీశ్ లు రెండు ప్రాంతాలకు జిల్లాల అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించడం మంత్రులిద్దరికి కలసి వస్తుంది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారికి టిఆర్‌ఎస్‌లో పెద్దపీట వేసేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్న మంత్రులు
ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగం గతంలో తీవ్ర అన్యాయానికి గురైంది. జిల్లా నుండి ప్రాణహిత, గోదావరి నదులతో పాటు పలు వాగులు ప్రవహిస్తాయి. లక్షల ఎకరాల అడవి జిల్లాను పరుచుకుని ఉండడంతో ఎపుడు ఇక్కడ కరవు పరిస్థితులు ఏర్పడేవి కావు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా తీవ్ర కరువు నెలకొంటున్న నేపథ్యంలో జిల్లాలోని సుద్దవాగు, గొల్లవాగులతో పాటు ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ను సస్యశ్యామలం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ జిల్లా ప్రాజెక్టుల పూర్తి కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సహకారంతో ముందుకు పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి అత్యంత ప్రాదాన్యత నిస్తోంది. రాబోయే రెండేళ్లలో దాదాపు అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలోని చెరువులన్నింటి ని సుందరంగా తీర్చిదిద్దారు. మిషన్ భగీరథ పనులను అత్యంత వేగంగా కొనసాగిస్తున్నారు. తమ శాఖల ద్వారా మంత్రులిద్దరు ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ మేలు చేసేందుకు ప్రయత్నిస్తున్నార ని జిల్లాప్రజలు చర్చించుకుంటున్నారు.
వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ఇంద్రకరణ్‌రెడ్డి
సీనియర్ రాజకీయ నాయకుడిగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి జిల్లా పై పూర్తి పట్టు ఉంది. జిల్లా పరిషత్ ఛైర్మన్, ఎంపి, ఎమ్మెల్యే లాంటి పదవులను నిర్వహించిన ఆయన మొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రిపదవిని అలంకరించారు. తనకున్న అనుభవాన్ని రంగరించి పాలనలో ప్రభుత్వ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించారు. కృష్ణా పుష్కరాల పనులను వేగంగా కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి, వేములవాడ తదితర ఆలయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని బాసర పుణ్య క్షేత్రంలో యాభై కోట్ల రూపాయాలతో వివిధ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
పాలనలో భాగస్వాములవుతున్న పార్టీ శ్రేణులు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనులలో టిఆర్‌ఎస్ శ్రేణులను భాగస్వా మ్యం కల్పించేందుకు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతుంది. సగానికి పైగా పాలక వర్గాలు కొలువుదీరాయి. ప్రభుత్వం చేపట్టిన ఆసరా పించన్లు, డబుల్ బెడ్‌రూం పథకాలకు సంబందించి గ్రామ స్థాయిలోని క్యాడర్‌ను ఇన్‌వాల్‌వ చేస్తున్నారు. సిఎం కెసిఆర్‌తో పదిహేను సంవత్సరాలు కలిసి నడిచిన వారందరికి పదవుల భర్తీలో ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలందరిని కలుపుకొని వెళుతూ శాఖల మద్య సమన్వయం సాదిస్తున్నారు. జిల్లా అభివృద్దిలో కీలకంగా వ్యవహరించే కలెక్టరేట్‌లోని అధికారుల గుండెలలోను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాలు విజయ వంతంగా అమలు చేసే బాధ్యతను మంత్రులు ఇద్దరు తమ భుజ స్కందాలపై వేసుకున్నారు. ఇన్నాళ్లు స్థబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్‌లో మంత్రుల తీరుతో నూతనోత్సాహవం వెల్లువిరుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో మొక్కవోని దీక్షతో పనిచేసిన తమకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఊరటనిస్తున్నాయని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.