-ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి పెద్దపీట
-మిషన్ భగీరథకు రూ. 3వేల కోట్లు
-రహదారుల అభివృద్ధికి మహర్దశ
-గ్రామీణ కులవృత్తులకు మరింత చేయూత
కరీంనగర్-సూర్యప్రత్యేకప్రతినిధి:రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేంధర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సి, ఎస్టిల అభివృద్దికి పెద్దపీట వేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రానున్న ఎన్నికల కంటే ముందు ప్రతి ఇంటికి స్వచ్చనీరును అందించే పథకమైన మిషన్‌భగీరథకు రూ.3వేల కోట్లు నిధులను కేటాయించారు.ఎస్సి, ఎస్టి స్లబ్ ప్లాన్ పథకానికి పేరుమార్చి ఎస్సిల అభివృద్దికై కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎస్సిల అభివృద్దికి రూ. 14,375 కోట్లు, ఎస్టిల అభివృద్దికి రూ.8,165కోట్ల ప్రతిపాదన బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చేందుకు హరిహరపథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఈ పథకానికి రూ.50వేల కోట్లను కేటాయించింది. త్రాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.25వేల కోట్లను కేటాయించారు. దీనితో ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలో నూతనంగా నిర్మించనున్న ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతంగా పూర్తికానున్నట్లు కనిపిస్తుంది.రాష్ట్రంలో రహదారుల అభివృద్ది కోసం రూ.5,033కోట్లను కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో రహదారుల అభివృద్దికూడా ఈ సంవత్సరం కాలంలో కానున్నాయి. రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మీకులను ఆదుకునేందుకు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలను ప్రారంభించింది. రాష్టమ్రంత్రి కల్వకుంట్ల తారాకరామారావు చేనేత కార్మీకులను ఆదుకునేందుకు ప్రతి వారంలో ఒక రోజు ప్రతి అధికారి చేనేత వసా్తల్రను ధరించాలని ఆదేశించన సంగతి తెలిసిందే. చేనేత కార్మీకుల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ.1,200కోట్లు మంజురు చేశారు. దీనితో రాజన్నసిరిసిల్ల జిల్లాతో పాటు ఉమ్మడి జిల్లాలోని చేనేత కార్మీకులకు లబ్దిచేకురనుంది. కులవృత్తులను ప్రోత్సహించేందుకు తెరాస ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. అందుకు అనుగుణంగా ఈ బడ్జెట్‌లో వారికి నిదులను కేటాయించారు. రజకులకు రూ.500ల కోట్లు, నాయిబ్రహ్మణులకు రూ.500ల కోట్లు కేటాయించింది. వచ్చే 2ఏళ్లలో రాష్ట్రంలోని నాలుగు లక్షల మంది యాదవులకు 84లక్షల గొర్రెలను పంపిణి చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసింది. ఇందుకు గాను 75శాతం రాయితీతో ఈ గొర్రెలను పంపిణి చేయనుంది. కేజి టు పిజి విద్యలో భాగంగా ప్రాథమికవిద్యకు కూడా బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. విద్యకు 12,705 కోట్లను కేటాయించారు. తెలంగాణను ఐటి హాబ్‌గా మార్చడానికి ఆ శాఖ మంత్రి కేటిఆర్ చేస్తున్న కృషి ప్రపంచ దేశాల్లో మెచ్చుకుంటున్న తరుణంలో ఐటిరంగానికి కూడా ఈ బడ్జెట్‌లో రూ.252 కోట్లను కేటాయించారు. దీనితో రాష్ట్రంలో ఐటి రంగం మరింతగా అభివృద్ది చెంది యువతకు ఉపాధి దొరకనుంది. నిరంతర విద్యుత్‌ను అందించే లక్ష్యంగా విద్యుత్ రంగ అభివృద్దికి రూ.4,203 కోట్లను కేటాయించారు. దీనితో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతా లో లో ఒల్టెజిల నిర్మూలనకు 400కోట్ల వరకు ఖర్చు పెట్టనున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఆ పరిశ్రమ అభివృద్ది కోసం రూ.985 కోట్లను కేటాయించింది. మహిళా, ఎస్సి,ఎస్టి పారిశ్రామీక వేత్తలకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. కళ్యాణ లక్ష్మితో పాటు షాధిముబారక్ పథకాలకు అందించే సహయాన్ని రూ.75,116కు పెంచింది. ఈ పథకానికి ఈ బడ్జెట్‌లో మరిన్ని నిదులను కేటాయించింది. పర్యాటక, సంస్కృతిక రంగాలకు కూడా రూ.198కోట్లను కేటాయించింది. దీనితో రాష్ట్రంలో జరుగనున్న వివిధ పండగలకు ఘనంగా జరుపనున్నారు. రాష్ర్టంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రూ.4,828 కోట్లను కేటాయించింది.గతంలో జర్నలిస్టుల సంక్షేమానికి రూ.10కోట్లను కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.30కోట్లను కేటాయించింది.
మాతృమూర్తులైన మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం మానవీయ కోణం నిర్ణయాలు తీసుకున్నది. ఈ బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మహిళా శిశు సంక్షేమానికి మొత్తం రూ.1731.50కోట్లు కేటాయించింది. గర్భిణీ స్త్రీలకు మూడు విడతల్లో రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఆసుపత్రుల్లో ప్రసవం కోసం చేరిన వెంటనే గర్భిణీ స్త్రీలకు రూ.4వేలు, డిశ్చార్జి అయ్యాక మరో రూ.4వేలు, పుట్టిన బిడ్డకు పోలియో టీకా వేయించుకోవడానికి వచ్చినప్పుడు మరో 4వేలు అందిం చాలని నిర్ణయించామన్నారు. ఆడపల్లిను ప్రసవిస్తే అదనంగా మరో వెయ్యి రూపాయాలు ఇస్తామని ప్రకటించారు. ఇక పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం 16రకాల వస్తువులతో ే సిఆర్ కిట్‌ను ఇవ్వబోతున్నామని తెలిపారు.ఈ కిట్ నవజాత శిశువులకు మూడు నెలల వరకు ఉపయోగపడే విధంగా ఉంటుంద న్నారు. కిట్‌లో తల్లిబిడ్డకు ఉపయోగపడే సబ్బులు, బేబ అయిల్, చిన్నపిల్లల పరుపు, దోమతె ర, డ్రస్సులు, చీరలు, హ్యాండ్ బ్యాగు, టవళ్లు, నాప్కిన్‌స, పౌడర్ డైవర్లు, షాంపు, పిల్లల ఆట వస్తువులుంటాయి. కేసిఆర్ కిట్ కోసం రూ.605 కోట్లు కేటాయించారు. జోగినిలు, పెళ్లి చేసుకోకుండా తల్లిదండ్రుల సేవలో ఉన్నవారు, విది వంచితులు, అనారాగ్యంతో ఉన్న పేద ఒంటరి మహిళలు రాష్ట్రంలో సుమారు 3లక్షల మంది ఉన్నట్లు అంచనా వీరికి ఆసరా పథకం క్రింద పించన్ అందించి ఆదుకునేందుకు రూ.360కోట్లను ే టాయించారు. రాష్ట్ర బడ్జెట్‌పై ప్రతిపక్షాలు పొంతనలేని బడ్జెట్‌గా వ్యాఖ్యానిస్తుంది. కాని ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లాలో అనేక ప్రాంతాల ఆయా సామాజిక సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేంధర్ చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టి సంబరాలు జరుపుకున్నారు.
అణగారిన నగరల్లో వెలుగులు నింపుతాం
రాష్ర్టంలోని పేద, బడుగు బలహీన వర్గాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ఆర్థిక మంత్రి ఈటెల రాజేంధర్ స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల్లో విశ్వాసం నింపేలా బడ్జెట్ ఉంటుందని తెలిపారు.అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణను తెచ్చుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అన్ని వర్గాల కు అండగా ఉండాలనే సంకల్పంతో ఏ వర్గాలు అయితే అభివృద్ది చెందలేదో.. ఆ వర్గాల అభివృద్దే ఎజెండాగా బడ్జెట్‌ను రూపొందించడం జరిగిందన్నారు. కుల వృత్లుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 60ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వాసం కలగలేద న్నారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. అణగారిన వర్గాలకు అండగా ఉండి వారిలో విశ్వాసం నింపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికంలో మగ్గే ప్రజలందరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. 2017-18 బడ్జెట్ అణగారిన వర్గాల అభివృద్దే లక్ష్యంగా తయారు చేయబడ్డదన్నారు. తెలంగాణ బడ్జెట్ సోమవారం ఉదయం అసెంబ్లిలో మంత్రి ఈటెల ప్రవేశపెట్టనున్నారు.