హైదరాబాద్: ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ (ఎల్‌విపిఐఇ) ఆధ్వర్యంలో ఆదివారం జూబ్లీహిల్‌సలో నిర్వహించిన `గ్లకోమా అవేర్‌నెస్ వాక్'ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్‌విపిఇఐ నుండి జూబ్లీహిల్‌స చెక్‌పోస్‌ట వరకు జరిగిన ఈ అవేర్‌నెస్ వాక్‌లో డాక్టర్ జి ఎన్ రావు ఇతర వైద్యులు పాల్గొన్నారు. మార్చి 12 నుండి 18వ తేదీ వరకు నిర్వహిస్తున్న వరల్‌డ గ్లకోమా వీక్‌లో భాగంగా ఈ వాక్‌ను నిర్వహించారు. భారతదేశంలో శాశ్వత అంధత్వానికి ప్రధానంగా కారణంగా ఉంటూ `సైలెంట్'గా కంటిపై ప్రభావం చూపించే ఈ వ్యాధిపై అవగాహనను కాగా గ్లకోమా కంటిలో ఒత్తిడిని పెంచుతూ, కంటిలోని నరానికి నష్టం కలిగి అది శాశ్వతమైన అంధత్వానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.