గ్రేటర్ హైదరాబాద్‌లో గుర్తించిన 333 అక్రమ హోర్డింగ్‌లలో ఇప్పటి వరకు 194 హోర్డింగ్‌లు తొలగించారు. నగరంలో అనుమతిలేకుండా ఏర్పాటుచేసిన 333 హోర్డింగ్‌లు తొలగింపు ప్రక్రియ జనవరి నుంచి కొనసాగిస్తునట్లు జీహెచ్‌ఎంసీ అడ్వర్‌టైజింగ్ విభాగం అడిషనల్ కమిషనర్ అద్వైతకుమార్ సింగ్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం తొలగించిన 194 హోర్డింగ్‌ల్లో 83 హోర్డింగ్‌లను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ఎజెన్సీ తొలగించగా మిగిలిన 111 హోర్డింగ్‌లను సంబంధిత ప్రైవేట్ ఎజెన్సీలు స్వయంగా తొలగించాయయన్నారు. అక్రమ హోర్డింగ్‌ల తొలగింపుకు ప్రతిజోన్‌కు ప్రత్యేకంగా ఇంజనీర్లను నియమించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa