అహ్మదాబాద్ : గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రంగోల వద్ద రాజ్‌కోట్ - భావ్‌నగర్ రహదారిపై పెళ్లి బృందంతో ట్రక్కు వెళ్తుంది. అయితే ఆ రహదారిపై ఉన్న వంతెన వద్దకు ట్రక్కు రాగానే అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 25 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa