తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్ర రాజకీయాలంటూ చేస్తున్న హడావుడంతా కుమారుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన గత నాలుగేళ్లుగాముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏనాడూ రైతుకు సాయం చేయలేదని, ఇప్పుడు దేశం వ్యాప్తంగా ఉన్న రైతులు ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు . కమిషన్ల కోసమే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులు చేస్తున్నారని ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa