భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం జిల్లాలోని నుంచి పలు మండలాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అధికారులు బస్సు సేవలను నిలిపివేస్తూ నిర్ణయం వెలువరించారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల సరిహద్దు పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో గడిచిన శుక్రవారం ఎన్‌కౌంటర్ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎదురు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులతో పాటు ఒక జవాను మృతిచెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa