రంగారెడ్డి: స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో ఈ నెల 8వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ట్రస్టు యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు వివరాలను తెలియజేస్తూ.. స్వర్ణభారత్ ట్రస్టు, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ మేళాల్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ పూర్తి చేసిన యువతి, యువకులు మాత్రమే అర్హులని ప్రకటించారు. ఉద్యోగ మేళా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందన్నారు. ఉద్యోగ మేళాలో ఎంపికైన యువతి, యువకులు మూడు నెలల పాటు ఉచిత వసతితో పాటు భోజనం సదుపాయం కల్పిస్తారన్నారు. అదేవిధంగా ఎంపికైన అభ్యర్థులను ఉచితంగానే డిగ్రీ చదివిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa