వరంగల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని నగరంలో 2కే రన్ నిర్వహించారు. నగర పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఈ రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలన్నారు. అలాగే మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వారి సంరక్షణకు ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. కాగా... ఈ రన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి కలెక్టరేట్ వరకు జరగ్గా మహిళలు, విద్యార్థినులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa