ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం పల్లిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వరుడు మృతిచెందగా.. వధువు గాయపడింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో నిన్న రాత్రి వివాహం జరిగాక తిరిగి వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేటకు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa