అందాల తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ దఢక్ అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. మరాఠీ చిత్రం సైరత్‌కి రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఇషాన్ ఖట్టర్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. అయితే తల్లితో ఎంతో క్లోజ్‌గా ఉండే జాన్వీకి శ్రీదేవి మరణం గుండెకోతని మిగిల్చింది. తల్లి మరణం తర్వాత కొద్ది రోజులు షూటింగ్‌కి దూరంగా ఉన్న జాన్వీ ఆ విషాదం నుండి కాస్త తేరుకొని తిరిగి షూటింగ్‌లో పాల్గొంది. బాంద్రా కార్టర్ రోడ్‌లో జాన్వీ, ఇషాన్ ఖట్టర్‌లపై పలు సన్నివేశాలు చిత్రీకరించాడు దర్శకుడు శశాంక్ ఖైతాన్. జాన్వీకి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విండో దగ్గర ఆలివ్ గ్రీన్ శారీ ధరించిన జాన్వీ పోనితో కనిపించింది. రెండు రోజుల పాటు ప్రధాన పాత్రలపై రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించిన దర్శకుడు ఆ తర్వాత కోల్‌కతాలో ఇంటర్వెల్ సీన్‌ని తెరకెక్కించనున్నారట. అనుకున్న టైంకే చిత్రాన్ని రిలీజ్ చేస్తామని దర్శకుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక తల్లి మరణం తర్వాత విషాదంలో ఉన్న జాన్వీ ఇటీవల తన తండ్రి బోని కపూర్‌తో కలిసి శ్రీదేవి అస్థికలని రామేశ్వరంలో కలిపారు. గురువారం హరిద్వార్‌లో వీఐపీ ఘాట్ వద్ద పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్‌కపూర్, మనీశ్ మల్హోత్రా, కుటుంబసభ్యులు, సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 6న జాన్వీ వృద్ధాశ్రమంతో పాటు సోనమ్ కపూర్ గృహంలో తన కుటుంబ సభ్యులతో కలిసి 21వ బర్త్‌డే వేడుక జరుపుకున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa