పంజాబ్: ప్రముఖ పంజాబ్ సూఫీ గాయకుడు ఉస్తాద్ ప్యారేలాల్ వదాలీ కన్నుమూశారు. అమృత్‌సర్‌లో ఈ ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందారు. ప్యారేలాల్ వదాలీ ఉస్తాద్ పురానా చంద్ వాదాలీ సోదరుడు. పంజాబీ సూఫీ సంగీతంలో వీరు ప్రముఖులుగా పేరుగాంచారు. ప్యారేలాల్ అనారోగ్యంతో ఫోర్టీస్ ఎస్కార్ట్స్ ఆస్పత్రిలో గురువారం జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మృతిచెందారు. కాఫీయన్, గజల్, భజనతో పాటు వివిధ రకాల పాటలు బాలీవుడ్ పాటలు పాడటంతో వీరు సుప్రసిద్ధులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa