న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి జనరిక్ మందుల సరఫరా కొరత ఉందని టీఆర్ఎంపీ కవిత అన్నారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి జన ఔషధ కేంద్రాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి ఔషధాలు సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఔషధ సమీకరణకు పథకాలు రూపొందించాలని ఆమె సూచించారు. ప్రధానమంత్రి జన ఔషధి యోజన కింద తెలంగాణకు జనరిక్ మందుల సరఫరా పెంచాలని ఎంపీ కవిత కోరారు. ఈ పథకం కింద తెలంగాణకు మందుల సరఫరా సరిగా జరగడం లేదన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. జనరిక్ ఔషధ కేంద్రాలు లేకపోవడం వల్ల కొరత ఏర్పడినట్లు కవిత తెలిపారు.