హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శనరావు, పొన్నం వెంకటేశ్వరరావులు ఆరోపించారు. తమ పార్టీ ఈ నెల 19న తలపెట్టిన సామాజిక సమర సమ్మేళనం సభను నిజాం కళాశాలలో జరుపుకునేందుకు తొలుత అనుమతి ఇచ్చి తర్వాత రద్దు చేశారని, దీంతో తాము సరూర్‌నగర్ ఔట్‌డోర్ స్టేడియంలో సభను ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కేసీఆర్ తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తమ ప్రభుత్వానికి శాంతియుతంగా నిరసనలు తెలియజేయవచ్చు అని చెప్పిన సీఎం నేడు నిరసనలను, ఆందోళనలను అడ్డుకుంటున్నారని వారు విమర్శించారు.