సూర్యాపేట: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు మిషన్ భగీరథ అని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఈ పథకం ద్వారా ఇంటింటికి మంచినీటిని అందించడం ఆయన ఆశయమని తెలిపారు. 2018 నాటికి ఇంటింటికి మంచినీటిని అందిస్తామని వెల్లడించారు. పేదల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. సబ్బండ వర్గాల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.