ఇటీవలే జరిగిన 3 రాష్ట్రాల ఎన్నికల్లో త్రిపురలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు త్రిపుర సీఎంగా విప్లవ్ దేవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. 25 ఏళ్ల వామపక్ష పాలనను కాదని ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు.
రాష్ట్రంలో బీజేపీని అధికారానికి చేరువ చేయడంలో విప్లవ్ దేవ్ కీలకపాత్ర పోషించడంతో ఆయనను సీఎం పదవి వరించింది.బీజేపీకి తరపున 35 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా, ఇండిజనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎ ఫ్‌టీ) తరపున 8 మంది విజయం సాధించారు. త్రిపుర అసెంబ్లీలో 60 స్థానాలుండగా 59 స్థానాలకు ఫిబ్రవరి 18న ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సీపీఎం అభ్యర్థి మరణంతో ఒక నియోజకవర్గంలో ఎన్నిక వాయిదాపడింది. కాగా, గోమ తి జిల్లా రాజ్‌ధర్ నగర్ గ్రామంలో 1971 నవంబరు 25న మధ్యతరగతి కటుం బంలో విప్లవ్ దేవ్ జన్మించారు. ఆయన తండ్రి హరధన్ దేవ్ అప్పట్లో జన్‌సంఘ్ స్థానిక నేతగా వ్యవహరించారు. 1999లో ఉదయ్‌పూర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. దాదాపు పదహారేళ్ల పాటు సంఘ్ ప్రముఖ నేతలతో కలిసి పనిచేశారు. 2015లో త్రిపురకు తిరిగి వచ్చిన దేవ్ బీజేపీ లో చురుగ్గా పనిచేశారు. ఆ మరుసటి ఏడాది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. రాష్ట్రంలో పార్టీ ఘన విజ యం సాధించడానికి ప్రధాన కారణం దేవ్ కృషేనని పార్టీ వర్గాల అభిప్రాయం. కాగా, మంత్రివర్గంలో తమకు సరైన ప్రాధాన్యం దక్కకుంటే ప్రభుత్వంలో చేరవద్దని ఐపీఎఫ్‌టీ నేతలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa