న్యూఢిల్లి :భారతదేశంలోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇదొక మంచి వార్త. భారత్‌కు చెందిన సుమారు 2 లక్షల మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోవడానికి జపాన్ ఆసక్తి ప్రదర్శిస్తోంది. అమెరికా వైఖరి కారణంగా ఐటి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో లైఫ్ సైన్సెస్, ఆర్థిక రంగం, సర్వీసులు, వ్యవసాయ రంగాల్లో అత్యున్నత నైపుణ్యం కలిగిన సిబ్బంది జపాన్‌కు అవసరం. ఉద్యోగ కల్పనతోపాటు వారికి ఏడాదిలోగా గ్రీన్ కార్డులను కూడా ఇస్తామని తద్వారా వారు ఇక్కడ శాశ్వతంగా నివసించవచ్చునని జపాన్ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa