హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. నగరంలోని బంజారాహిల్స్‌లో గ్లకోమాపై నేడు అవగాహన కార్యక్రమం జరిగింది. సెంటర్ ఫర్ సైట్ ఆధ్వర్యంలో రెడ్ సన్ బ్లూ హోటల్‌లో ఈ అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. మంత్రి సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరై గ్లకోమాపై ప్రజా అవగాహన సీడీలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంటి సమస్యలు సహా అన్ని ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa