లాహౌర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు చేదు అనుభవం ఎదురైంది. జమియా నమీనియా ఇస్లామిక్ వర్సిటీలో ఆయన ఒక సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యార. ఆయన వేదిక మీద ప్రసంగించేందుకు వెళ్తుండగా ఓ యువకుడు చెప్పు విసిరి పెద్దగా నినాదాలు చేశాడు. చెప్పు నేరుగా షరీఫ్ భుజాలకు, చెవులకు తాకడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారులు ఆ యువకుణ్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు..
అంతకుముందు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి ఖవాజా ఆసిఫ్‌కూ ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆయన తన నియోజకవర్గం సియోల్‌కోట్‌లో ఓ సభలో ప్రసంగిస్తుండగా ముఖంపై ఓ వ్యక్తి నల్లసిరా వేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa