హైదరాబాద్ :వచ్చే సంవత్సరం మార్చి నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందని, 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోర్టల్‌ను ఆవిష్కరించి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్ నుంచి నాయకులను గుర్తించే కార్యక్రమాలు మొదలవుతాయని, యువతకు పెద్దపీట వేస్తామని.. యువ నాయకత్వం కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని నమోదు చేశామని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల నుంచి గుర్తింపు కూడా వచ్చిందని తెలిపారు. రెండు రాష్ట్రాలలో కూడా కార్యకర్తల స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని అన్నారు.