ఆదిలాబాద్ జిల్లా పెంబి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖ నాయక్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సీఎం కేసీఆర్ బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిచ్చారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ పై అన్ని వర్గాల నుంచి హర్షామోదాలు వ్యక్తం అవుతున్నాయని చెప్పారు. పలువురు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పెంబి మండలాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు.