నేడు ఓయూలో మానసిక వికలాంగుల క్రికెట్ మ్యాచ్

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 08:48 AM
 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఏ గ్రౌండ్‌లో నేడు మానసిక వికలాంగుల క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు ఆంధ్ర మహిళా సభ (ఏఎంఎస్) ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం హెడ్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు. ఈ మ్యాచ్ ద్వారా మానసిక వికలాంగులు తమలోని ప్రతిభ, నైపుణ్యం, పోటీతత్తం, టీమ్‌వర్క్‌ను ప్రదర్శిస్తారని చెప్పారు. ఏఎంఎస్ చెన్నై, ఏఎంఎస్ హైదరాబాద్ టీమ్‌ల మధ్య ఈ పోటీ జరుగనున్నదని పేర్కొన్నారు. క్రీడాభిమానులు పెద్దఎత్తున హాజరై పోటీలను తిలకించి, వారిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.