ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 10:02 AM
 

లండన్ : ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కన్నుమూశారు. ఆయన వయసు 76 ఏళ్లు. ఈ విశ్వంలో ఏలియన్స్ ఉన్నాయని హాకింగ్ అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. హాకింగ్‌కు ముగ్గురు పిల్లలు. లూసీ, రాబర్ట్, టిమ్‌లు తమ తండ్రి హాకింగ్ చనిపోయినట్లు ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. హాకింగ్ ఓ గొప్ప శాస్త్రవేత్త అని, ఆయన్ని ఈ ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హాకింగ్ జీవిత చరిత్ర ఆధారంగా హాలీవుడ్‌లో థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ సినిమాను రూపొందించారు. ఆ ఫిల్మ్‌కు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. 1963లో హాకింగ్‌కు మోటార్ న్యూరాన్ వ్యాధి సోకింది. ఆ తర్వాత ఆయన వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. వీల్‌చైర్ నుంచి ఆయన అనేక విశ్వరహస్యాలను చేధించారు. క్యాంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ చదవిన హాకింగ్.. అనేక ఖగోళ అంశాలపై సిద్ధాంతాలను ప్రతిపాదించారు.