న్యూఢిల్లీ: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకోసం ఒక కొత్త పథకాన్ని మంగళవారం ప్రకటించింది. ట్రాక్టర్, వ్యవసాయ యాంత్రీకరణ రుణాల పరిష్కారం కోసం వన్ టైం సెటిల్ మెంట్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా ముఖ్యంగా 2016, సెప్టెంబర్ 30 నాటికి సందేహాస్పదంగా లేదా లాస్‌ఎసెట్‌స కేటగిరీలో పడి ఉన్న రుణాలను పరిష్కరించనున్నట్టు తెలిపింది. ఈ పథకం మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ ప్రత్యేక పథకం కింద రూ.6 వేలకోట్ల రుణాలను సెటిల్ చేసేందుకు యోచిస్తున్నట్టు ఎస్‌బీఐ ఎండీ రాజనీష్ కుమార్ తెలిపారు. అలాగే మొత్తం రుణంలో 40శాతాన్ని రైట్ ఆఫ్ చేయనున్నట్టు చెప్పారు. దీనిపై ఆయా శాఖ స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.ఎస్‌బీఐ వివిధ కేటగిరీల్లో వన్ టైంసెటిల్‌మెంట్ పథకాన్ని ఆఫర్ చేస్తుందనీ, తద్వారా రుణ రికవరీని మెరుగు పర్చుకుంటుందని ఆయన తెలిపారు. ఈ ట్రాక్టర్ రుణాలు పెద్దనోట్లకు సంబంధించినవి కావని అని వివరించారు. ఈ ఖాతాలు ఇప్పటికే (సెప్టెంబర్ 30 నాటికి) నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) కేటగిరీలో ఉన్నట్టు స్పష్టం చేశారు.
ప్రధానికి ఫ్లిప్ కార్‌ట సీఈఓ ప్రశంస.. స్పందించిన మోదీ: మన దేశ ప్రజలను ప్రధాని మోదీ ఎంత బాగా అర్థం చేసుకుని తన వైపు తిప్పుకున్నారో చెప్పడానికి ఉత్తరప్రదేశ్ ఎన్నికలే నిదర్శనమని ఫ్లిప్ కార్‌ట సీఈఓ సచిన్ బన్సల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు చూస్తేనే తెలుస్తోందని, ఇటీవల వెలువడ్డ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ద్వారా మోదీ మన దేశాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నారనే విషయం అర్థమవుతుందని, ఇది వ్యాపారవేత్తలకు ఓ పాఠం కావాలని, మోదీ ఏ విధంగా అయితే ప్రజలను అర్థం చేసుకున్నారో, ఖాతాదారులను అర్థం చేసుకునే విషయంలో వ్యాపారవేత్తలు అదే మార్గాన్ని అనుసరించాలని ఆ ట్వీట్ లో ఆయన సూచించారు. కాగా, ఈ ట్వీట్ కు ప్రధాని మోదీ స్పందిస్తూ, ప్రజలను నేను అర్థం చేసుకోవడం కన్నా, బీజేపీపై వారు విశ్వాసం ఉంచారు. ఆ విశ్వాసాన్ని మేము పోగొట్టుకోము అని అన్నారు.
హైదరాబాద్లోనూ భారీగా దర్శనమిచ్చిన చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దొంగ నోట్లు: భారత కరెన్సీ నోట్లపై రిజర్‌వ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రితమైన నోట్లు ఇటీవల ఢిల్లీలోని ఏటీఎంలలో నుంచి వచ్చి కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్లోనూ అటువంటి నోట్లు కనపడ్డాయి. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న రూ.2000, రూ.500 నోట్లను బ్యాంకుకు తీసుకొచ్చిన ఓ వ్యక్తి వాటిని డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించాడు. బ్యాంకు అధికారులు విషయాన్ని గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని అరెస్టు చేశారు.
యూసుఫ్ షేక్ అనే స్టేషనరీ షాప్ యజమాని ఏకంగా రూ.9.90 లక్షల విలువ గల చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉన్న నోట్లను తీసుకొచ్చాడని పోలీసులు తెలిపారు. తాను ఖాతా కలిగి ఉన్న మల్కాజిగిరిలోని అలహాబాద్ బ్యాంకు క్యాషియర్కు ఆ నోట్లనే ఇచ్చి తన పేరుమీద డిపాజిట్ చేయమని చెప్పాడని, అయితే సదరు బ్యాంకు మేనేజర్ తమకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడకు చేరుకుని యూసుఘ్న అరెస్టు చేశామని చెప్పారు. ఆ నోటు అచ్చం ఒరిజినల్ నోటులాగే ఉందని, ఒక్క చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్ప అన్ని ఫీచర్లు ఒరిజినల్ నోట్ల లాగే ఉన్నాయని పోలీసులు అన్నారు.