రాష్ట్రంలోని బీసీల స్థితిగతులపై అధ్యయనానికి బీసీ కమిషన్ ఛైర్మన్ బీఎస్ రాములు బృందం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించింది. పలు గ్రామాల్లో పేద ముస్లింల ఇండ్లకు, చిరువ్యాపారం చేసుకొనే దుకాణాలకు వెళ్లి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.వారి వివరాలను నమోదు చేసుకొని వినతిపత్రాలు స్వీకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా బ్యాంకు రుణాలతో ఉపాధి పొందుతున్నారా తదితర వివరాలను సేకరించారు.